భారీగా పతనమైన స్టాక్‌ మార్కెట్లు

22 Feb, 2021 17:36 IST|Sakshi

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. భారీ స్థాయిల్లో లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సోమవారం కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు దిగువన ట్రేడింగ్‌ ఆరంభించాయి. 50,936 వద్ద స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ కాసేపు లాభాల్లో పయనించింది. తర్వాత ఇంట్రాడేలో 50,975 వద్ద గరిష్టాన్ని తాకి క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. సూచీకి ఏ దశలోనూ మద్దతు లభించలేదు. ఓ దశలో 1,257 పాయింట్లు కోల్పోయి 49,632 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్‌ 1,145.44‌ పాయింట్ల లేదా 2.25 శాతం నష్టంతో 49,744.32కు చేరుకుంటే, నిఫ్టీ 306.05 పాయింట్లు కోల్పోయి 14,675.70 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.

స్టాక్ మార్కెట్ లో అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడితే.. ఐటీసీ లిమిటెడ్‌, టెక్‌ మహీంద్రా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టాల్ని చవిచూశాయి. దేశంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నా కరోనా కేసులు మళ్లీ పెరగడంతో ఆ ప్రభావం సూచీలపై పడినట్లు తెలుస్తుంది. మహారాష్ట్రలో 24 గంటల్లో కేసుల సంఖ్య 7,000పైగా పెరిగాయి. కేసులు ఇలాగే కొనసాగితే త్వరలో లాక్ డౌన్ విధించే సూచనలు ఉన్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు