నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

8 Jul, 2021 17:02 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్‌ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావానికి తోడు బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా షేర్లు భారీగా పడిపోవడంతో స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడికి గురి అయ్యింది. దీంతో 485.82 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ 52,568 వద్ద ముగిస్తే, 151.80 పాయింట్ల నష్టపోయి నిఫ్టీ 15,727 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ జీవన కాల గరిష్ఠాలను తాకిన ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 74.71గా ఉంది.

స్టాక్ మార్కెట్లో నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేర్లు నష్టపోతే.. బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. నేడు ఎక్కువ శాతం అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు