నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!

3 Dec, 2021 16:03 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజులు వరుస లాభాల్లో ముగిసిన తర్వాత నేడు భారీగా నష్టపోయాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత నష్టాల బాట పట్టాయి. కరోనా కొత్త వేరియింట్​ ఒమిక్రాన్​ కేసులు దేశంలో వెలుగు చూడడం మదుపరులను ఆందోళనకు గురిచేసింది. అంతర్జాతీయంగా పెరుగుతోన్న కరోనా కేసులు విదేశీ సంస్థాగత మదుపరులను వెనకడుగు వేసేలా చేశాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. 

చివరకు, సెన్సెక్స్ 764.83 పాయింట్లు (1.31%) క్షీణించి 57,696.46 వద్ద ఉంటే, నిఫ్టీ 205 పాయింట్లు (1.18%) క్షీణించి 17,196.70 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.12 వద్ద నిలిచింది. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా పడిపోతే.. యుపీఎల్, బిపీసీఎల్, ఒఎన్‌జీసీ, ఐఓసిఎల్, ఎల్ & టి షేర్లు భారీగా లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ మినహా ఇతర అన్ని సెక్టోరల్ సూచీలు ఎరుపురంగులో ముగిశాయి.

(చదవండి: ఐఐటీ హైదరాబాద్‌.. నియామకాల్లో జోరు)

మరిన్ని వార్తలు