లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

6 Oct, 2021 16:09 IST|Sakshi

ముంబై: రెండు రోజుల వరుస లాభాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాలు రావడం, ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశాల సందర్భంగా దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. చివరకు, సెన్సెక్స్ 555.15 పాయింట్లు (0.93%) క్షీణించి 59,189.73 వద్ద ఉంటే, నిఫ్టీ 176.30 పాయింట్లు (0.99%) క్షీణించి 17,646 వద్ద ముగిసింది. సుమారు 1291 షేర్లు అడ్వాన్స్ అయితే, 1754 షేర్లు క్షీణించాయి, 115 షేర్లు మారలేదు.(చదవండి: ఫేస్‌బుక్‌ డౌన్.. వారికి మాత్రం పండుగే పండుగ!)

డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనమై రూ.75.02 వద్ద ఆరు నెలల కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఒఎన్‌జిసి, యుపిఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు రాణిస్తే.. హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్ బిఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జెఎస్ డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్ షేర్లు భారీగా నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్, ఐటీ, మెటల్, ఫార్మా, ఆటో, రియాల్టీ, పిఎస్‌యు బ్యాంకు సూచీలు 1-3 శాతం పడిపోవడంతో అన్ని సెక్టోరల్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.

మరిన్ని వార్తలు