Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

17 Nov, 2021 16:14 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మూడో రోజు వరసుగా నష్టాల్లో ముగిశాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడితో మధ్యాహ్నం తర్వాత సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. త్రైమాసిక ఫలితాలు ముగియడంతో పాటు దేశీయంగా ఎలాంటి సానుకూల పరిణామాలు లేకపోవడంతో సూచీల నష్టాల్లో కొనసాగాయి. అమెరికా-చైనా అధ్యక్షుల మధ్య జరిగిన చర్చలు ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. 

చివరకు, సెన్సెక్స్ 314.04 పాయింట్లు (0.52%) క్షీణించి 60,008.33 వద్ద ఉంటే, నిఫ్టీ 100.50 పాయింట్లు (0.56%) క్షీణించి 17,898.70 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.28 వద్ద ఉంది. నిఫ్టీలో యుపీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐఓసీ షేర్లు ఎక్కువగా నష్ట పోయిన వాటిలో ఉన్నాయి. ఎక్కువ లాభపడిన వాటిలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ షేర్లు ఉన్నాయి. రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా సూచీలు ఒక్కొక్కటి 1 శాతం నష్టపోయాయి. 

(చదవండి: అదిరిపోయిన ఎలక్ట్రిక్ కారు.. 700 కి.మీ రేంజ్, ధర కూడా తక్కువే!)

మరిన్ని వార్తలు