బ్యాంకింగ్‌,ఐటీ జోరు ‌: లాభాల హోరు

9 Mar, 2021 16:18 IST|Sakshi

51 వేల ఎగువకు సెన్సెక్స్‌

15వేలకు ఎగువన ముగిసిన నిఫ్టీ

సాక్షి, ముంబై: రోజంతా భారీ ఒడిదుడుకులను ఎదుర్కొన్న స్టాక్‌మార్కెట్‌ చివరికి పటిష్టంగా ముగిసింది. సెన్సెక్స్‌ 51 వేలకు ఎగువన, నిఫ్టీ 15వేలకు ఎగువన ముగియడం విశేషం. ముఖ్యంగా ఆఖరి గంటలో బ్యాంకింగ్‌రంగ లాభాలతో సెన్సెక్స్‌  584 పాయింట్లు ఎగిసి 51025 వద్ద ముగిసింది. నిఫ్టీ 142 పాయింట్ల లాభంతో 15098 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్, ఐటీ రంగ లాభాలు మార్కెట్లకు భారీ ఊతమిచ్చాయి. మరోవైపు మెటల్ 2.5 శాతం క్షీణించగా, పీఎస్‌యు బ్యాంక్, ఫార్మా, రియాల్టీ, మీడియా, ఆటో ఇండెక్స్ రంగాలు  కూడా నష్టాల్లో ముగిసాయి. హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యుఎల్, మరియు బజాజ్ ఫైనాన్స్‌లలో లాభాల్లో ముగియగా, బీపీసీఎల్‌,  టాటా స్టీల్, గెయిల్, ఇండియన్ ఆయిల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, సిప్లా భారీగా నష్టపోయాయి.

మరిన్ని వార్తలు