పుంజుకున్న స్టాక్‌ మార్కెట్‌.. లాభాలతో ముగింపు!

4 Oct, 2021 16:23 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తిరిగి పుంజుకున్నాయి. ఈ వారం ట్రేడింగ్‌ను లాభాలతో ఆరంభించాయి. నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకుని భారీగా దూసుకెళ్లాయి. ముఖ్యంగా రియల్టీ, మెటల్‌, పవర్‌ సెక్టార్‌ షేర్లు రాణించడంతో నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 500 పాయింట్ల మేర లాభపడింది. చివరకు, సెన్సెక్స్ 533.74 పాయింట్లు (0.91%) లాభపడి 59,299.32 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 159.30 పాయింట్లు (0.91%) పెరిగి 17,691.30 వద్ద ముగిసింది. నేడు సుమారు 2227 షేర్లు అడ్వాన్స్ అయితే, 961 షేర్లు క్షీణించాయి, 172 షేర్లు మారలేదు.

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 74.32గా ఉంది. నిఫ్టీలో డివిస్ ల్యాబ్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్ షేర్లు రాణిస్తే.. సిప్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, యుపిఎల్, ఐచర్ మోటార్స్, ఐఓసి షేర్లు నష్టపోయాయి. రియాల్టీ, మెటల్, విద్యుత్ రంగాలు ఒక్కొక్కటి  2 శాతం పెరగడంతో అన్ని సెక్టోరల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. (చదవండి: స్క్విడ్‌ గేమ్‌ క్రేజ్‌....నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి..!)

మరిన్ని వార్తలు