Stock Market: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు!

7 Oct, 2021 16:04 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాల నేపథ్యంలో లాభాల్లో కొనసాగాయి. అలాగే, రేపటి నుంచి జరగబోయే ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్ష, ఈ నెలలో వెలువడబోయే కంపెనీల త్రైమాసిక ఫలితాలపై సానుకూలంగా ఉన్న మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. చివరకు, సెన్సెక్స్ 488.10 పాయింట్లు (0.82%) పెరిగి 59677.83 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 144.30 పాయింట్లు (0.82%) పెరిగి 17790.30 వద్ద ముగిసింది. సుమారు 2096 షేర్లు అడ్వాన్స్ అయితే, 1023 షేర్లు క్షీణించాయి, 119 షేర్లు మారలేదు.

డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.74.72 వద్ద ఉంది. నిఫ్టీలో టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, ఎంఅండ్ఎం, మారుతి సుజుకి, ఐచర్ మోటార్స్ షేర్లు రాణిస్తే.. ఒఎన్‌జిసి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, బ్రిటానియా, హెచ్‌డిఎఫ్‌సి షేర్లు భారీగా నష్టపోయాయి. చమురు, గ్యాస్ మినహా అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ రియాల్టీ, ఆటో సూచీలు 4-6 శాతం పెరిగాయి. (చదవండి: బుకింగ్‌లో మహీంద్రా ఎక్స్‌యువి 700 ఎస్‌యూ‌వి సరికొత్త రికార్డు)

మరిన్ని వార్తలు