భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

25 Nov, 2021 16:02 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ రిలయన్స్‌ వంటి దిగ్గజ రంగ షేర్ల కొనుగోళ్లతో సూచీలు లాభాల వైపు అడుగు వేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ.. రియల్టీ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో మార్కెట్ భారీ లాభాల్లో పయనించింది. చివరకు, సెన్సెక్స్ 454.10 పాయింట్లు (0.78%) లాభపడి 58,795.09 వద్ద ఉంటే, నిఫ్టీ 121.30 పాయింట్లు (0.70%) పెరిగి 17,536.30 వద్ద ముగిసింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.52 వద్ద ఉంది. నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, దీవిస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టెక్ మహీంద్రా షేర్లు భారీ లాభాలను పొందగా.. బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐఓసీ, ఇండస్ సిండ్ ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి. చమురు & గ్యాస్, రియాల్టీ, ఫార్మా రంగాలలో సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి. అయితే, ఆటో & బ్యాంకింగ్ పేర్లలో కొన్ని అమ్మకాలు కనిపించాయి.

(చదవండి: మార్కెట్లోకి షియోమీ ఎలక్ట్రిక్‌ వాహనాలు వచ్చేది అప్పుడే..?)

మరిన్ని వార్తలు