ఐటీ సెగ : రెండో రోజూ నష్టాలు

7 Jan, 2021 15:51 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో సెషన్‌లో కూడా   నష్టాలతో ముగిసింది.  కొత్త  ఏడాదితో తొలిసారిగా బుధవారం  భారీగా నష్టపోయిన  సూచీలు గురువారం  స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ప్రధానంగా ఎఫ్‌ఎంపీసీ,  ఐటీ, ఫార్మ  షేర్ల నష్టాలతో ఆరంభ లాభాలను కోల్పోయిన  సెన్సెక్స్ 81 పాయింట్లు నష్టపోయి  48093 వద్ద ముగియగా, నిఫ్టీ 9 పాయింట్లు  కోల్పోయింది. తద్వారా 14150 దిగువకు చేరింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, టీసీఎస్‌, ఐటీసీ లాంటి హెవీవెయిట్లలో బలహీనత కారణంగా సెన్సెక్స్ రోజు గరిష్ట స్థాయి నుండి 500 పాయింట్లకు పైగా పడిపోయింది. మరోవైపు టాటా స్టీల్‌, హిందాల్కో, భారతి ఎయిర్‌టెల్‌, అదానిపోర్ట్స్‌, ఇండస్‌ ఇంక్‌  టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు