Sensex crashes: స్టాక్‌మార్కెట్‌  క్రాష్‌, రుపీ రికార్డు కనిష్టం

29 Aug, 2022 09:46 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే సెన్సెక్స్‌ ఏకంగా 1100 పాయింట్లు  కుప్పకూలింది. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 995 పాయింట్లు పతనమై  57842 వద్ద, నిఫ్టీ  295 పాయింట్ల నష్టంతో 17265 వద్ద కొన సాగుతున్నాయి. 

ఐటీ దిగ్గజాలు టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌, టీసీఎస్, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్ నష్ట పోతున్నాయి. అయితే  హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, అపోలో హాస్పిటల్‌, మారుతి, నెస్లే లాభపడు తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)పై అందరి దృష్టి నెలకొని ఉంది. ఫలితంగా రిలయన్స్‌ కూడా నష్టాల్లో ఉంది.

మరోవైపుడాలరు డాలరు మారకంలో రూపాయి ఆల్‌ టైం కనిష్టానికి చేరింది. ప్రారంభ ట్రేడింగ్‌లో  డాలర్‌తో పోలిస్తే 26 పైసలు పతనమై రికార్డు కనిష్టం 80.10 స్థాయిని టచ్‌ చేసింది.  ప్రస్తుతం 80.02 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

మరిన్ని వార్తలు