ఎన్‌ఐఐటీ- ఎవరెడీ.. జోరు

6 Aug, 2020 14:11 IST|Sakshi

రేటింగ్స్‌ అప్‌గ్రేడ్‌ ఎఫెక్ట్‌

ఎవరెడీ 5 శాతం హైజంప్‌

52 వారాల గరిష్టానికి షేరు

మసాచుసెట్స్‌ టెక్నాలజీ వాటా కొనుగోలు

ఎన్‌ఐఐటీ షేరు 5 శాతం ప్లస్‌

ఆర్‌బీఐ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 425 పాయింట్లు జంప్‌చేసి 38,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఈ నేపథ్యంలో బ్యాటరీల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్‌, ఐటీ శిక్షణా సంస్థ ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఎవరెడీ ఇండస్ట్రీస్
కంపెనీ దీర్ఘకాలిక రేటింగ్స్‌ను ఇండియా రేటింగ్స్‌.. అప్‌గ్రేడ్‌ చేసిన వార్తలతో ఎవరెడీ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ జోరందుకుంది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికంకావడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 140 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! గతేడాది ద్వితీయార్ధంలో రుణ భారాన్ని తగ్గించుకోవడం, లాభదాయకతను నిలుపుకోవడం వంటి అంశాలు ఎవరెడీ ఇండస్ట్రీస్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌కు దోహదం చేసినట్లు ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది. దీంతో BB- రేటింగ్‌ను తాజాగా BB+కు పెంచినట్లు తెలియజేసింది.

ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌
ఇప్పటికే కంపెనీలో 1.87 శాతం వాటాను కలిగిన మసాచుసెట్స్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌(ఎంఐఐటీ) తాజాగా 2.12 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 102కు చేరింది. ప్రస్తుతం 3 శాతం ఎగసి రూ. 100 వద్ద ట్రేడవుతోంది. షేరుకి 96.75 ధరలో 30 లక్షల నిట్‌ షేర్లను ఎంఐఐటీ కొనుగోలు చేసింది. 

మరిన్ని వార్తలు