Nimrat Kaur: బాలీవుడ్‌ నటి లగ్జరీ కారు, దర్జా పోజు వైరల్‌

17 Aug, 2022 12:43 IST|Sakshi

సాక్షి, ముంబై:  బాలీవుడ్ నటులు,లగ్జరీ కార్లును సొంతం చేసుకోవడం చాలాకామన్‌. తాజాగా లంచ్‌బాక్స్‌ నటి ఈ  లిస్ట్‌లో చేరింది. బాలీవుడ్‌ నటి  నిమ్రత్ కౌర్ తాజాగా   లగ్జరీకారును కొనుగోలు చేసింది. కొత్త కారుకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. "వెల్‌కమ్ హోమ్ మై బ్లాక్ బీస్ట్" అంటూ  ఒక పిక్‌నుషేర్‌ చేసింది.  కొత్త కారు కొన్నందుకు  ఫ్యాన్స్‌ అభినందనలతో ముంచెత్తుతున్నారు.  ప్రస్తుతం కౌర్‌ పిక్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కొత్త రేంజ్ రోవర్‌లో ముంబైలోని మాడాక్ ఫిల్మ్స్ ఆఫీసుకు వచ్చిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతోంది.

ఐదో తరం రేంజ్ రోవర్ కారు భారతదేశంలో కంపెనీ విడుదల చేసినంది. నటి  నిమ్రత్‌ కొన్న రేంజర్ రోవర్ ఎస్‌యూవీ ధర 2.38 కోట్లకు పై మాటేనని అంచనా . నిమ్రత్‌కౌర్‌  అభిషేక్ బచ్చన్ ,యామీ గౌతమ్‌లతో కలిసి నటించిన దాస్విలో కనిపించింది. ఈ మూవీలో  అభిషేక్ ఆన్ స్క్రీన్ భార్య బిమ్లా దేవి పాత్రలో నటించింది. దాస్వీ కంటే ముందు 2016లో అక్షయ్ కుమార్ ఎయిర్‌లిఫ్ట్‌లో నటించింది. ఒక హిందీ వెబ్ సిరీస్ ది టెస్ట్ కేస్‌లో కూడా కౌర్ యాక్ట్‌ చేసింది.

కాగా  కొత్త రేంజ్ రోవర్ స్టాండర్డ్ , లాంగ్-వీల్‌బేస్ బాడీ డిజైన్‌లలో ఐదు సీట్లతో అందుబాటులో ఉంది. కొత్త రేంజ్ రోవర్ హైబ్రిడ్ ధరలు రూ. 2.61 కోట్లు నుండి ప్రారంభం. గత నెలలో కారు డెలివరీలు  ప్రారంభమయ్యాయి.  ఈ కారు పెట్రోల్ , డీజిల్ వెర్షన్‌లలో, 25 ట్రిమ్స్‌లో లభ్యం.

మరిన్ని వార్తలు