రయ్‌మంటూ దూసుకెళ్లిన రిలయన్స్‌..! డీలా పడ్డ టీసీఎస్‌..!

13 Feb, 2022 18:55 IST|Sakshi

గత వారం దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఒకానొక సమయంలో భారీ లాభాలను గడిస్తూనే, అమెరికా ఫెడ్‌ రేట్లు, ద్రవ్యోల్భణం వంటి అంశాలతో స్టాక్‌మార్కెట్స్‌ తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఇక దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో టాప్-10 అత్యంత విలువైన కంపెనీలలో తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) గత వారం 1,03,532.08 కోట్ల మేర క్షీణించింది. టాప్‌-10 మార్కెట్‌ కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీగా నష్టపోయింది. వీటిలో కేవలం రిలయన్స్‌ మాత్రమే భారీగా లాభపడింది.  

30 షేర్ల బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ గత వారం 491.90 పాయింట్లు, సుమారు 0.83 శాతం మేర క్షీణించింది. దీంతో టాప్-10 విలువైన కంపెనీల్లో కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మాత్రమే లాభపడింది, గత వారం రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ గణనీయంగా పెరిగింది. 

రిలయన్స్‌ గ్రూప్స్‌ మార్కెట్‌-క్యాప్ రూ. 30,474.79 కోట్లు పెరిగి రూ.16,07,857.69 కోట్లకు చేరుకుంది. 

► టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ రూ.44,037.2 కోట్లు తగ్గి రూ.13,67,021.43 కోట్ల వద్ద స్థిరపడింది.

► హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌-క్యాప్ రూ.13,772.72 కోట్లు తగ్గి రూ.4,39,459.25 కోట్లకు చేరుకుంది. 

► హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మార్కెట్ విలువ రూ.11,818.45 కోట్లు తగ్గి రూ.5,30,443.72 కోట్ల వద్ద స్థిరపడింది.

► ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్‌ విలువ రూ.9,574.95 కోట్లు తగ్గి రూ.5,49,434.46 కోట్లకు చేరుకుంది.

► గత వారం బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,987.52 కోట్లు తగ్గి రూ.4,22,938.56 కోట్ల వద్ద స్థిరపడింది.

► ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,386.79 కోట్లు తగ్గి రూ.7,23,790.27 కోట్లకు చేరుకుంది.

► మొబైల్‌ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,157.91 కోట్లు క్షీణించి రూ.3,92,377.89 కోట్ల వద్ద స్థిరపడింది. 

► హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్‌ క్యాప్‌ రూ.2,993.33 కోట్లు తగ్గి రూ.8,41,929.20 కోట్లకు చేరుకుంది.

► ఇక ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాల్యుయేషన్ రూ.803.21 కోట్లు తగ్గి రూ.4,72,379.69 కోట్ల వద్ద స్ధిరపడింది.

చదవండి: గత ఏడాది హాట్‌కేకుల్లా అమ్ముడైన ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ ఇవే..!

మరిన్ని వార్తలు