అభివృద్ధికి పరుగులు,పెట్టుబడులకు ఆకర్షణీయ దేశం భారత్‌

17 Jul, 2021 10:24 IST|Sakshi

న్యూఢిల్లీ: అభివృద్ధికి పరుగులు విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా భారత్‌ ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. దేశం చేపట్టిన విస్తృత స్థాయి సంస్కరణలు దీనికి కారణమని అన్నారు.  అమెరికా కంపెనీల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లను ఉద్ధేశించి ఆమె మాట్లాడారు. దేశం కోవిడ్‌–19 సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా పేర్కొన్న ఆర్థికమంత్రి, కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్‌లు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పురోగతి వంటి అంశాలను చర్చించారు.
అమెరికా ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూఎస్‌బీఐసీ) నిర్వహించిన ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో జనరల్‌ ఎలక్ట్రిక్, బాక్స్టర్‌ హెల్త్‌కేర్‌ యూఎస్‌ఏ, బ్రాంబుల్స్, మార‍్ష్‌ అండ్‌ మెక్‌లెనన్, పెప్సికో తదితర ప్రముఖ విదేశీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కోవిడ్‌–19 సెకండ్‌వేవ్‌ సమయంలో భారత్‌కు వనరుల కోసం ఒక గ్లోబల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటుకు కృషి చేసిన 40 అమెరికా టాప్‌ కంపెనీల సీఈఓలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.   

మరిన్ని వార్తలు