స్టార్టప్‌ ఇండస్ట్రీ: రూ. 20 లక్షల కోట్లు, యూనికార్న్‌ల సెంచరీ

12 Sep, 2022 11:08 IST|Sakshi

దేశంలో 100 సంస్థలకు ఆవాసం 

వీటి విలువ రూ. 20 లక్షల కోట్లు:ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

చెన్నై: స్టార్టప్‌ పరిశ్రమలో 100 యూనికార్న్‌లకు ఇండియా ఆవాసంగా నిలిచినట్లు ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా పేర్కొన్నారు. వీటి మొత్తం ఉమ్మడి విలువ 250 బిలియన్‌ డాలర్లు(రూ. 20 లక్షల కోట్లు)గా తెలియజేశారు. గత కొన్నేళ్లలో ఈ సంస్థలు 63 బిలియన్‌ డాలర్ల(రూ. 5,04,000 కోట్లు) పెట్టుబడులను సమీకరించినట్లు వెల్లడించారు.

దేశీయంగా అంకుర సంస్థలు(స్టార్టప్‌) ఊపిరి పోసుకునేందుకు అనువైన పటిష్ట వ్యవస్థ ఏర్పాటైనట్లు కాంచీపురం ఐఐఐటీ, డిజైన్, తయారీ నిర్వహించిన 10వ స్నాతకోత్సంలో కొత్త గ్రాడ్యుయేట్లనుద్ధేశించి మంత్రి ప్రసంగించారు. సిలికాన్‌ వ్యాలీలోని 25 శాతం స్టార్టప్‌లను భారత సంతతికి చెందినవారే నిర్వహిస్తుండటం గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక్కడినుంచి గ్రాడ్యుయేట్‌ అయిన వ్యక్తి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారి ఇతరులకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తారన్న అభిప్రాయంతో ఈ విషయాలను ప్రస్తావిస్తున్నట్లు తెలియజేశారు. 25 శాతం స్టార్టప్‌లను భారతీయులు నిర్వహిస్తున్న సిలికాన్‌ వ్యాలీపై ఇప్పటికే మీలో చాలా మంది దృష్టి పెట్టి ఉంటారని వ్యాఖ్యానించారు.  
 
  

మరిన్ని వార్తలు