కొత్త ఇన్‌కంటాక్స్ పోర్టల్‌ లోపాలపై సోషల్ మీడియాలో మీమ్స్

17 Jun, 2021 14:04 IST|Sakshi

జూన్ 7 సాయంత్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో వినియోగదారులు సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ పై నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి సీతారామన్ ఇన్ఫోసిస్, దాని సహ వ్యవస్థాపకుడు చైర్మన్ నందన్ నీలేకనిని ఒక ట్వీట్ లో ఫిర్యాదులను పరిష్కరించాలని కోరారు. 2019లో బిడ్డింగ్ ప్రక్రియలో రూ.4,242 కోట్ల వ్యయంతో ఇన్ఫోసిస్ ఈ ప్రాజెక్టు దక్కించుకుంది. రిటర్న్ ల ప్రాసెసింగ్ సమయాన్ని 63 రోజుల నుంచి ఒక రోజుకు తగ్గించడానికి, రీఫండ్ లను వేగవంతం చేయడానికి, తర్వాత తరం ఆదాయపు పన్ను ఫైలింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇన్ఫోసిస్ లక్ష్యంగా పెట్టుకుంది.

మొదటి రోజు నుంచే ఈ ఫైలింగ్‌ పోర్టల్‌లో తలెత్తిన సమస్యలు, లోపాలపై యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేస్తూన్నారు. దీనికి ఇన్ని కోట్లు ఖర్చు చేశారా? అని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు పోర్టల్ టెస్ట్ చేయకుండానే ఎందుకు తీసుకువచ్చారు అని తమ కోపాన్ని మీమ్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈ సమస్యలపై స్పందించిన కేంద్రం లోపాలపై భాగస్వాముల నుంచి సూచనలను కేంద్ర అర్థిక శాఖ ఆహ్వానించింది. ఈ నెల 18 వరకు సూచనలు అందించాలని కోరింది. ఈ నెల 22న ఇన్ఫోసిస్‌ అధికారుల బృందం, ఆర్జిక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించే సమావేశంలో వీటిపై చర్చించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ ఫైలింగ్‌ పోర్టల్‌లో లోపాలు, సమస్యలను fmo@nic.in అనే ఈమెయిల్‌ చిరునామాకు ఈ 18వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు పంపించాలని కోరింది.

చదవండి: పది నిమిషాల్లో ఈ-పాన్ కార్డు పొందండి ఇలా..?

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు