నిస్సాన్ సెల్ఫ్‌డ్రైవింగ్‌ కారు జీటీ-ఆర్(ఎక్స్)

22 Dec, 2020 16:34 IST|Sakshi

ప్రపంచంలోని స్పోర్ట్స్ రేసింగ్ బెస్ట్ కార్లలో నిస్సాన్ జీటీ-ఆర్ ఒకటి. దీనిని మొదటిసారిగా 2007లో జపాన్‌లో తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వినియోగదారులను ఆకట్టుకుంటింది.ఈ సూపర్ కార్ చరిత్ర చాలా పెద్దది. 2020లో తీసుకొచ్చిన నిస్సాన్ జిటి-ఆర్ కార్ లగ్జరీ స్పోర్ట్స్ కార్లలో ది బెస్ట్ వన్. ఇది జిటి-ఆర్ శక్తివంతమైన ట్విన్-టర్బో ఇంజిన్, హైటెక్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ తో వస్తుంది. ఇప్పుడు నిస్సాన్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను భవిష్యత్ లో తీసుకురావాలని భావిస్తుంది. దీనిలో భాగంగా ఆర్ 35-జనరేషన్ నిస్సాన్ జీటీ-ఆర్ ఆధారంగా పనిచేసే నిస్సాన్ జీటీ-ఆర్(ఎక్స్) 2050 ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ కారును తీసుకు రాబోతున్నారు.(చదవండి: యాపిల్‌ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్‌ కారు!)

నిస్సాన్ జీటీ-ఆర్(ఎక్స్)ని 2050 నాటికీ తీసుకురావాలని భావిస్తున్నారు. దీనికి సంబందించిన డిజైన్ ని కాలిఫోర్నియాలోని పసాదేనాలోని ఆర్ట్‌సెంటర్ కాలేజ్ ఆఫ్ డిజైన్ విద్యార్థి జేబమ్ చోయ్ రూపొందించారు.  ఇది మెదడు కదలికలతో పనిచేస్తుంది. అమెరికాలోని నిస్సాన్ డిజైన్ కి సంబందించిన డిపార్ట్మెంట్ లో ఇంటర్న్‌షిప్ ‌చేస్తున్నాడు చోయ్. ఈ ఇంటర్న్‌షిప్ లో భాగంగా మెదడు ఆధారంగా పనిచేసే సూపర్ కార్ జిటి-ఆర్ (ఎక్స్) 2050 డిజైన్ ని రూపొందించాడు. ఈ డిజైన్ చుస్తే మాత్రం సాధారణ కారు డిజైన్ లాగా మాత్రం కనిపించడం లేదు. జీటీ-ఆర్ 4.5 అడుగుల ఎత్తుతో పోలిస్తే ఇది 2 అడుగుల ఎత్తులో మాత్రమే ఉంది. ఇందులో డ్రైవ్ చేసే వ్యక్తికీ ఒక సూట్ ధరిస్తారు. ఈ సూట్ మెదడు కదలికల ఆధారంగా కారును ఆటోమేటిక్ గా ఆపరేట్ చేస్తుంది. ఇది మానవ మెదడును కంప్యూటర్‌తో అనుసంధానించే "సాధారణ" సెల్ఫ్-డ్రైవింగ్ కార్ల కంటే మెరుగైన పనితీరును కనబరుస్తుంది అని సమాచారం. ఈ డిజైన్ చివరిది కాదు. దీనిలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు