Niti Aayog: పైవేటు రైళ్లపై వాళ్లకి ఆసక్తిలేదట?

5 Mar, 2022 09:15 IST|Sakshi

ప్రైవేట్‌ రైళ్ల ప్రాజెక్టుపై ఇన్వెస్టర్ల అనాసక్తి 

నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌  

న్యూఢిల్లీ: రైల్వే విభాగంలో ప్రైవేట్‌ సంస్థలను అనుమతించడం తదితర చర్యలతో రైల్వే అసెట్స్‌ను మానిటైజ్‌ చేయాలన్న ప్రతిపాదనకు ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ చెప్పారు. 

మానిటైజేషన్‌ ప్రక్రియను సరిగ్గా రూపొందించకపోవడం ఇందుకు కారణం కావచ్చని .. ఈ నేపథ్యంలో సదరు ప్రణాళికలను రైల్వే శాఖ పునఃసమీక్షిస్తోందని ఆయన తెలిపారు. కచ్చితంగా రాబడులు వస్తాయంటేనే పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్‌ ముందుకు వస్తుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అసెట్‌ మానిటైజేషన్‌ ప్రణాళికలో పేర్కొన్న రూ. 6 లక్షల కోట్ల అసెట్స్‌ నుంచి కచ్చితంగా ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంత్‌ వివరించారు.  

చదవండి: ఎల్‌ఐసీ ఐపీవో వాయిదా!

మరిన్ని వార్తలు