Tesla: టెస్లా ఎంట్రీపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..!

5 Dec, 2021 15:58 IST|Sakshi

భారత ఆటోమొబైల్‌ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు టెస్లా సిద్దమైన విషయం తెలిసిందే. దిగుమతి సుంకాలు అధిక ఉండడంతో టెస్లా రాక కాస్త ఆలస్యమవుతోంది. అధిక దిగుమతి సుంకాలపై ఇప్పటికే టెస్లా ప్రతినిధులు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా భారత్‌లోకి టెస్లా ఎంట్రీ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు.    

డ్యూటీ కోత తగ్గించే అవకాశం..!
ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలనే టెస్లా ప్రతిపాదనపై భారత ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. దిగుమతి సుంకాలపై ఎంతమేర కోత పెట్టవచ్చుననే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. టెస్లా ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ రెవెన్యూ విభాగం తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా మూడు సంవత్సరాల పాటు దిగుమతి సుంకాలను తాత్కాలికంగా తగ్గించే అవకాశాలపై కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు ఆయన అన్నారు. 
చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1

ప్రభుత్వంతో చర్చలు..!
ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా కోరిన విషయం తెలిసిందే. టెస్లాతో పాటుగా ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్ధ బీఎండబ్ల్యూ కూడా దిగుమతి సుంకాలపై ప్రభుత్వం మరొకసారి ఆలోచించాలని కోరింది.  దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహన అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని టెస్లా వాదించింది. అదనంగా 10 శాతం సోషల్‌ వెల్‌ఫేర్‌ సర్‌చార్జిని కూడా  మాఫీ చేసే అంశంపై కూడా కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది.

విదేశీ కార్లపై దిగుమతి సుంకాలు భారత్‌లో ఇలా..!
విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 60-100 శాతం దిగుమతి సుంకాలను విధిస్తుంది.  ఇంజిన్‌ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుకొని 40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తించనుంది.
చదవండి: లక్షకోట్లకు పైగా నష్టం, రాజకీయాల్లోని ఆ వృద్దులపై నిషేదం విధించాలి..! ఎలన్‌ పిలుపు

మరిన్ని వార్తలు