BVR Subrahmanyam: నీతి ఆయోగ్‌ సీఈవోగా బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం 

20 Feb, 2023 21:11 IST|Sakshi

న్యూఢిల్లీ: థింక్-ట్యాంక్ నీతి ఆయోగ్ సీఈవోగా మాజీ వాణిజ్య కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. ప్రభుత్వ నిర్ణయానికి క్యాబినెట్ నియామకాల కమిటీ (ఫిబ్రవరి 20న) ఆమోదం తెలిపింది. సుబ్రమణ్యం బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు నీతి ఆయోగ్ సీఈవోగా ఉంటారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో  తెలిపింది  ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌  ప్రపంచ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా  నియమితులైన  కారణంగా ఈ పరిణామం  చోటు చేసుకుంది.   


కాగా సుబ్రహ్మణ్యం చత్తీస్‌గఢ్  1988 బ్యాచ్  ఐఏఎస్‌ అధికారి, అతను సెప్టెంబర్ 30, 2022న వాణిజ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. మరోవైపు పరమేశ్వరన్ అయ్యర్‌  జూలై 1, 2022న నీతి ఆయోగ్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 2009 లో ప్రభుత్వాధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి , 2014లో ప్రభుత్వ స్వచ్ఛ్ భారత్ మిషన్‌కు నాయకత్వం వహించిన అయ్యర్‌ ఆ తరువాత ప్రపంచ బ్యాంకులో చేరారు. ఇపుడు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగ నున్నారు.

మరిన్ని వార్తలు