పూర్తి స్థాయి డిజిటల్‌ బ్యాంకులు రావాలి: నీతి ఆయోగ్‌

25 Nov, 2021 09:17 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా అందర్నీ ఆర్థిక సేవల పరిధిలోకి తేవడంలో ఇంకా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి డిజిటల్‌ బ్యాంకులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ ఒక చర్చాపత్రంలో పేర్కొంది. ఇవి భౌతిక శాఖల ద్వారా కాకుండా పూర్తిగా ఇంటర్నెట్, దాని అనుబంధ మార్గాల ద్వారా సర్వీసులను అందిస్తాయని తెలిపింది. ఇవి పూర్తి స్థాయి బ్యాంకుల్లాగే డిపాజిట్లు స్వీకరిస్తాయని, రుణాలు అందించడంతో పాటు ఇతరత్రా సర్వీసులు కూడా అందించగలవని పేర్కొంది.

ఈ విధానాన్ని రెండంచెలుగా అమలు చేయొచ్చని సూచించింది. ముందుగా డిజిటల్‌ బిజినెస్‌ బ్యాంక్‌ లైసెన్సులు ఇవ్వాలని ఆ తర్వాత దాన్నుంచి నేర్చుకున్న అనుభవాలతో యూనివర్సల్‌ బ్యాంక్‌ లైసెన్సు జారీ చేయొచ్చని నీతి ఆయోగ్‌ తెలిపింది.   
 

మరిన్ని వార్తలు