ప్రైవేటీకరించే బ్యాంకుల జాబితా సిద్ధంbu

4 Jun, 2021 02:09 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరించే ప్రభుత్వ రంగ బ్యాంకుల పేర్లను నీతి ఆయోగ్‌ ఖరారు చేసింది. ఈ జాబితాను డిజిన్వెస్ట్‌మెంట్‌పై కార్యదర్శులతో ఏర్పాటైన కీలక గ్రూప్‌ (సీజీఎస్‌డీ)కి సమర్పించినట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. క్యాబినెట్‌ కార్యదర్శి సారథ్యంలోని సీజీఎస్‌ నుంచి క్లియరెన్స్‌ లభించాక.. ఖరారైన పేర్లను ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం)కు పంపుతారు. అటుపైన తుది ఆమోదం కోసం ప్రధాని సారథ్యంలోని క్యాబినెట్‌కు పంపుతారు. క్యాబినెట్‌ ఆమోదం లభించిన తర్వాత ప్రైవేటీకరణకు వెసులుబాటు కల్పించేలా నియంత్రణపరమైన నిబంధనల్లో సవరణలు చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థను ప్రైవేటీకరించాలని 2021–22 కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. వాటిని ఎంపిక చేసే బాధ్యతను నీతి ఆయోగ్‌కి అప్పగించింది.

మరిన్ని వార్తలు