కరోనా టైంని కరెక్ట్‌గా వాడుకున్నా.. పిల్లనిచ్చిన మామ ఇంటినే కూల్చేయించా!: గడ్కరీ

17 Sep, 2021 11:30 IST|Sakshi

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తన యూట్యూబ్‌ ద్వారా నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?. అక్షరాల నాలుగు లక్షలకు పైనేనంట. అంతేకాదు తనకు పిల్లనిచ్చిన మామ ఇంటిని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చారట. అది ఎందుకో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
 

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. హరియాణాలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పనుల్ని సమీక్షించడానికి వెళ్లిన గడ్కరీ..  ఓ ఈవెంట్‌కు హాజరై కింది వ్యాఖ్యలు చేశారు.
 

‘‘కరోనా టైంలో ఇంటికే పరిమితమైన నేను రెండే పనులు చేశా. ఒకటి వంట చేయడం, రెండోది వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపన్యాసాలు ఇవ్వడం. ఆన్‌లైన్‌లో చాలా క్లాసులు తీసుకున్నా నేను. అంతేకాదు యూట్యూబ్‌లోనూ అప్‌లోడ్‌ చేశా. వాటిని వ్యూస్‌ ఎక్కువ రావడంతో యూట్యూబ్‌ నెలకు నాకు నాలుగు లక్షలు చెల్లిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు గడ్కరీ.

ఇది చదవండి: టోల్‌ గేట్ల ధరలపై నితిన్‌ గడ్కరీ విచిత్ర వ్యాఖ్యలు

ఇక పెళ్లైన కొత్తలో తన భార్య కాంచనకు తెలియకుండా..  రోడ్డు మధ్యలో ఉన్న  ఆమె తండ్రి ఇంటిని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశానని గుర్తు చేసుకున్నారాయన. ఈ విషయాన్ని తోటి అధికారులు తన దృష్టిని తీసుకొచ్చారని, అయినా కూడా ఆ పని చేయాల్సిందేనని ఆదేశించాలని చెప్పినట్లు నితిన్‌ గడ్కరీ నవ్వుతూ చెప్పారు.
 

క్లిక్‌ చేయండి: ‘హారన్‌’ సౌండ్లు మార్చేస్తాం: గడ్కరీ

మరిన్ని వార్తలు