ఎన్‌ఎండీసీ లాభం డౌన్‌

15 Nov, 2022 12:54 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ సెప్టెంబర్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 62 శాతం తగ్గి రూ.886 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్‌ రూ.6,882 కోట్ల నుంచి రూ.3,755 కోట్లకు పడిపోయింది.

వ్యయాలు రూ.3,743 కోట్ల నుంచి రూ.2,570 కోట్లకు వచ్చి చేరాయి. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈలో ఎన్‌ఎండీసీ షేరు ధర సోమవారం 0.26 శాతం పడిపోయి రూ.113.35 వద్ద స్థిరపడింది.

చదవండి: ఆ బ్యాంకులపై కొరడా ఝులిపించిన ఆర్బీఐ!

మరిన్ని వార్తలు