ఆగస్ట్‌లో హైదరాబాద్‌ మారథాన్‌, టైటిల్‌ స్పాన్సర్‌గా ఎన్‌ఎండీసీ!

12 Jul, 2022 09:13 IST|Sakshi

తెలంగాణ ప్రభుత్వం, ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌ రన్నర్స్‌ సొసైటీలు సంయుక్తంగా 11వ ఎడిషన్‌ ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌ మారథాన్‌ - 2022 ప్రారంభం కానున్నాయి. ఆగస్ట్‌ 27న 5కె ఫన్ రన్, ఆగస్టు 28న 10 కె, హాఫ్ మారథాన్  21.095కె , ఫుల్ మారథాన్ 42.195కెలు జరగనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. ఇందుకోసం 15వేల  మందికి పైగా రన్నర్లు, 3500 మందికి పైగా వాలంటీర్లు, 250 మంది వైద్య సిబ్బంది పాల్గొననున్నారు. 

ఇక ఈ హైదరాబాద్‌ మారథాన్‌ టైటిల్‌ స్పాన్సర్‌ షిప్‌ను ఎన్‌ఎండీసీ అందిస్తున్నట్లు ఆ సంస్థ రేస్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ మోర్పారియా తెలిపారు. హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనేవారికి ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు. 

మారథాన్‌ ఈవెంట్‌కు ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ ఫేస్‌ ఆఫ్‌ ది ఈవెంట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నిఖత్‌ జరీన్‌ మాట్లాడుతూ.. ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2022 ఎడిషన్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. నగరంలో జరిగే అతిపెద్ద కమ్యూనిటీ ఫిట్నెస్ ఈవెంట్‌ను విజయవంతం చేయాలని నిఖత్‌ జరీన్‌ పిలుపునిచ్చారు.   
 

మరిన్ని వార్తలు