Wipro Salary Hikes: విప్రో ఉద్యోగులకు శుభవార్త!

18 Aug, 2022 12:51 IST|Sakshi

సెప్టెంబర్‌ 1నుంచి ఉద్యోగుల జీతాల పెంపు, హైక్స్‌పై ప్రముఖ టెక్‌ దిగ్గజం విప్రో స్పందించింది. ఉద్యోగుల జీత భత్యాల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇప్పటికే తాము తీసుకున్న నిర్ణయంపైనే కట్టుబడి ఉన్నామని తెలిపింది. 

దేశంలో ఐటీ రంగం రోజురోజుకి వృద్ధి చెందుతుంది. దీంతో అవకాశాలు పెరిగిపోయాయి. అందుకే అట్రిషన్‌ రేటును నియంత్రించడం, కొత్త టాలెంట్‌ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించేలా విప్రో తన ఉద్యోగులకు బోనస్‌లు, ఇంక్రిమెంట్‌లు భారీగా పెంచే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో  ద్రవ్యోల్బణం ప్రభావం ఉద్యోగుల జీతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ మరికొన్ని నివేదికలు హైలెట్‌ చేశారు. ఈ నేపథ్యంలో జీతాల పెంపులో ఎలాంటి మార్పులు లేవని, సెప్టెంబర్ నుంచి శాలరీ హైక్‌ అమల్లోకి వస్తాయని విప్రో ప్రకటించింది. 

జూలై నుండి విప్రో ఉద్యోగులకు ప్రమోషన్‌లు ఇవ్వడం ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీ తన టాప్ పెర్ఫార్మర్లకు, మిడ్‌ నేజ్‌మెంట్ స్థాయి వరకు ప్రమోషన్లను అందించాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్‌లో ఆ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది' అని విప్రో తెలిపింది.

>
మరిన్ని వార్తలు