డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని ఎలక్ట్రిక్ బైక్

28 Mar, 2021 20:21 IST|Sakshi

హైదరాబాద్ కు చెందిన గడ్డం వంశీ అమెరికాలో బిజినెస్ మేనేజ్‌మెంట్ స్టడీస్ చేశారు. తర్వాత ఇండియాకు వచ్చి తన కలను నిజం చేసుకోవడానికి తన పది మంది ఫ్రెండ్స్ తో కలిసి మూడేళ్లు శ్రమ పడి ఒక ఎలక్ట్రిక్ బైక్ రూపొందించారు. ఆ బైక్ పేరు ఆటమ్‌ 1.0. దీని డిజైన్ చూడటానికి వింటేజ్ కేఫ్ రేజర్ మోడల్‌లా ఉంటుంది. బరువు అంతా కలిపిన 35 కేజీలే. అయితే, ఈ బైక్ గంటకు 25కి.మీ అధిక వేగంతో వెళ్తుంది. ఈ బైక్‌కి 2 సంవత్సరాల వారంటీ కూడా ఉంది. ఇది ముఖ్యంగా మైనర్లు, టీనేజర్లు, పెద్దవాళ్లు అందరికీ ఉపయోగపడేలా తయారు చేసినట్లు వారు పేర్కొన్నారు. దీనిని నడపడటానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని వారు పేర్కొంటున్నారు. 

ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 48 వోల్ట్, 250 వాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీని బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. సింగల్ ఛార్జ్ తో 100 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. మరొక విషయం ఏమిటంటే బైక్ బ్యాటరీ ప్యాక్‌ని మీరు బయటకు తీసి ఛార్జ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ బైక్‌కి దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోందని వంశీ తెలిపారు. ఈ కంపెనీ బైక్ తయారీ కేంద్రం తెలంగాణలో ఉంది. ఈ కేంద్రంలో రోజూ 250 నుంచి 300 బైకులు తయారుచేయగలరు. కస్టమర్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని భారీస్థాయిలో మాన్యుఫాక్చర్ యూనిట్ సిద్ధం చేశారు. 

ప్రస్తుతం ఈ బైక్ ధర రూ.50,000 ఉంది. కావాలనుకునేవారు ఆటోమొబైల్స్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మీరు ఆటం 1.0ని అడ్వాన్స్‌గా బైక్ బుక్ చేసుకోవాలంటే మీరు ముందుగా రూ.3,000 కంపెనీ వెబ్‌సైట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ బైక్‌ని రివోల్డ్ ఇంటెల్ కార్ప్ అనే స్టార్టప్ కంపెనీ లాంచ్ చేసింది. దీన్ని ఆర్ వి400 అనే పేరుతో లాంచ్ చేసింది. ఈ బైక్ ప్రత్యేకమైనది. దీనికి జియో-ఫెన్సింగ్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, క్లౌడ్ సర్వీసెస్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో 4జీ సిమ్ కార్డ్ కూడా ఉంది. 

చదవండి:

2030లో గాల్లో ఎగురనున్న హైబ్రిడ్‌ ట్రైప్లేన్‌!

కోమకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మైలేజ్ ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు