పన్ను చెల్లింపుదారులకు కేంద్రం షాక్..!

31 Dec, 2021 16:26 IST|Sakshi

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఐటీ రిటర్న్‌ల గడువును పొడగించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పేసింది. ఆదాయపు పన్ను రిటర్న్‌లు సజావుగా దాఖలు అవుతున్నాయని, ఈ రోజుతో ముగిసే ఐటీ రిటర్న్‌ల గడువును పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు.


టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగుతోందని, మధ్యాహ్నం 3 గంటల వరకు.. 5.62 కోట్ల రిటరర్న్స్‌ ఫైల్‌ అయ్యాయని, కేవలం ఇవాళ 20 లక్షల దాకా రిటర్న్స్‌ ఫైల్‌ అయ్యాయని తరుణ్‌ బజాజ్‌ తెలిపారు.

ఇదిలా ఉంటే 2021-22 అసెస్‌మెంట్‌ ఇయార్‌కు సంబంధించిన పన్ను చెల్లించేందుకు ఈ ఏడాది జులై 31తో ముగిసింది. కానీ, కొవిడ్‌ వ్యాప్తి, ఐటీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వం దానిని డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. అయితే, గత కొద్ది రోజుల నుంచి ఐటీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల గురించి తెలియజేస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు యూజర్లు ట్వీట్లు చేశారు. డిసెంబర్‌ 31 అనే తుదిగడువు పోర్టల్‌ డెవలపర్లకే గానీ.. పన్ను చెల్లింపుదార్లకు మాత్రం సరిపోదని పేర్కొన్నారు. మరికొందరు, ఆదాయపు పన్ను రిటర్న్‌ గడువు తేదీని పొడగించాలని కేంద్రాన్ని కోరడంతో పాటు ఈ ఐటీ పోర్టల్‌ సమస్యలను స్క్రీన్‌ షాట్లు తీసి ట్విటర్‌లో పోస్టు చేశారు.

(చదవండి: టెస్లా కార్లలో ‘కలకలం..!’)

 
 

మరిన్ని వార్తలు