NDTV: సెబీ అనుమతి అవసరంలేదు, ఎన్‌డీటీవీ ప్రమోటర్లకు అదానీ కౌంటర్‌

27 Aug, 2022 10:23 IST|Sakshi

ఆర్‌ఆర్‌పీఆర్‌కు ఆదేశాలు వర్తించవు 

అదానీ గ్రూప్‌ తాజా వివరణ

న్యూఢిల్లీ: ఎన్‌డీటీవీ ప్రమోటర్‌ సంస్థ ఆర్‌ఆర్‌పీఆర్‌లో వాటాను సొంతం చేసుకునేందుకు సెబీ అనుమతులు అవసరంలేదని అదానీ గ్రూప్‌ తాజాగా పేర్కొంది. ఆర్‌ఆర్‌పీఆర్‌ లేవనెత్తిన అంశాలు నిరాధారమని, న్యాయపరంగా ఆమోదనీయంకావని, సత్యదూరాలని వ్యాఖ్యానించింది. దీంతో వెనువెంటనే వారంట్ల స్థానే ఈక్విటీల కేటాయింపునకు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలియజేసింది. ఆర్‌ఆర్‌పీఆర్‌కు ఇచ్చిన రుణాలకుగాను పొందిన వారంట్లను ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు అదానీ గ్రూప్‌ సంస్థ వీసీపీఎల్‌ నిర్ణయించడం తెలిసిందే. తద్వారా ఎన్‌డీటీవీ ప్రమోటర్‌ సంస్థలో 99.5% వాటాను పొందనుంది. ఫలితంగా ఎన్‌డీటీవీలో ఆర్‌ఆర్‌పీఆర్‌కు గల 29.18% వాటాను సొంతం చేసుకోనుంది. 

కాగా నవంబర్ 2020లో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ తన ప్రమోటర్లను షేర్లను కొనడం లేదా విక్రయించకుండా రెండేళ్లపాటు నిషేధించిందని, అందువల్ల నవంబర్ వరకు వీసీపీఎల్‌కు షేర్లను బదిలీ చేయడం సాధ్యం కాదని పేర్కొన్న ఎన్‌డిటివి  స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌పై అదానీ గ్రూప్ స్పందించింది.

మరిన్ని వార్తలు