SpaceX:ఆస్ట్రోనాట్స్‌ ప్రయాణం...ఇంకేం చేస్తాం..డైపర్లు ధరిస్తాం..!

6 Nov, 2021 15:58 IST|Sakshi

భూమి నుంచి సుమారు 400 కిలోమీట‌ర్ల దూరంలో స్పేస్ స్టేష‌న్‌. 197 రోజులుగా అక్కడే గడుపుతున్న అస్ట్రోనాట్స్‌. మరికొద్ది సేపట్లో భూమికి తిరుగు ప్రయాణానికి షెడ్యూల్‌ ఖరారయ్యింది. కానీ ఆఖరి నిమిషంలో వారికి ఊహించని సమస్య ఎదురైంది. ఓవైపు షెడ్యూల్‌ మరోవైపు సాంకేతిక సమస్య. ఏ మాత్రం అటు ఇటు అయినా సరే అస్ట్రోనాట్స్‌ ప్రాణాలకు ప్రమాదంతో పాటు ఎంతో విలువైన స్పేస్‌ ఎక్వీప్‌మెంట్‌ను సైతం నష్టపోవాల్సి ఉంటుంది. అయితే అస్ట్రోనాట్స్‌ చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి నష్టం లేకుండా ఆ స్పేస్‌ క్యాప్యూల్స్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతకీ వారికి వచ్చిన సమస్య ఏంటీ ? దాన్ని ఎలా పరిష్కరించారు. ఎప్పుడు ఇక్కడికి చేరుకుంటున్నారు తెలుసుకోవాలంటే...

ఏప్రిల్‌ నెలలో అంతరిక్ష కేంద్రానికి పయనం 
ప్రయోగాల్లో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ 23న స్పేస్ఎక్స్‌ చెందిన క్యాప్యూల్స్‌ ద్వారా నాసాకు చెందిన ఆస్ట్రోనాట్స్‌ షేన్‌ కింబ్రో,ఫ్రాన్స్‌కు చెందిన థామస్‌ పెస్కెట్‌, జపాన్‌కు చెందిన అకిహికో హోషిడే, మహిళా వ్యోమగామి మెక్‌ ఆర్థర్‌లు స్పేస్‌లో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లారు. అలా స్పేస్‌లోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్‌ గరిష్టంగా 210 రోజుల పాటు స్పేస్‌లో ప్రయోగాలు చేయాల్సి ఉండగా శుక్రవారంతో 197 రోజులు పూర్తి చేసుకొని తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది.

అయితే ప్రయోగాలు పూర్తి చేసుకొని కిందికి వచ్చే సమయంలో క్యాప్యూల్స్‌లో ఉన్న యురినల్‌ మూత ఊడిపోవడంతో ఆ యూరిన్‌ క్యాప్యూల్స్‌ అడుగుకు చేరింది. దీంతో స్పేస్‌ స్టేషన్‌ నుంచి సుమారు 20 గంటల సమయం పట్టనుంది. అయితే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేసినా..ఆలస్యం అయితే అబ్జారెంట్‌ అండర్‌గార్మెంట్స్‌ (డైపర్లు) ధరించి భూమి మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహిళా వ్యోమగామి మెక్‌ ఆర్థర్‌ వర్చువల్‌  మీడియా సమావేశంలో వెల్లడించారు. 

భయపడేది లేదు
క్యూప్యూల్స్‌ అంతరాయంపై మహిళా ఆస్ట్రోనాట్స్‌ మెక్‌ ఆర్థర్‌ స్పందించారు. క్యాప్యూల్స్‌లోని యురినల్‌ విభాగంలో అంతరాయం ఏర్పడిందని మెక్‌ ఆర్థర్‌ తెలిపింది. స్పేస్‌ ప్రయాణం అనేక సవాళ్లతో కూడుకుందని, అన్నింటిని అధిగమించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ యురినల్‌ విభాగంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. టాయిలెట్‌ విభాగంలోని సమస్యతో అంతరిక్షం నుంచి భూమి మీదకు 20గంటల ప్రయాణం చేయడం అంత సులభం కాదు. ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు చెప్పారు. 

 

సెప్టెంబర్‌ నెలలోనే 
క్యూప్యూల్‌లో యురినల్‌ విభాగంలో టాయిలెట్‌ లీకైంది. ఆ విషయాన్ని సెప్టెంబర్‌లోనే గుర్తించినట్లు తెలుస్తోంది. స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్‌లోని ప్యానెల్‌లను పైకి లాగడం వల్ల లీకేజీ జరుగుతున్నట్లు ఆస్ట్రోనాట్స్‌ గుర్తించి, ఆ సమస్యను పరిష్కరించారు. తాజాగా ఆ తరహా సమస్య మరోసారి పునరావృతం కావడంతో భూమి మీదకు వచ్చేందుకు ఆస్ట్రోనాట్స్‌ అబ్జారెంట్‌ అండర్‌ గార్మెంట్స్‌ను ధరించి ఆదివారం ఉదయం 10గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి భయలు దేరి సోమవారం ఉదయం 4గంటలకు ఫ్లోరిడాలో దిగనున్నారు.

చదవండి: చంద్రుడిపై వైఫై నెట్‌ వర్క్‌ నేరుగా భూమిపైకే...!

మరిన్ని వార్తలు