రూ. 13,000లలో నోకియా లేటెస్ట్‌ ఫోన్

7 Dec, 2020 12:06 IST|Sakshi

రిలీజ్‌కు నోకియా 3.4 స్మార్ట్‌ ఫోన్‌ రెడీ

డిసెంబర్‌ మధ్యలో మార్కెట్లోకి ప్రవేశం!

ఇప్పటికే యూరోపియన్‌ దేశాలలో విడుదల

వెనుకవైపు 3 కెమెరాలు, 6.39 అంగుళాల డిస్‌ప్లే

3 జీబీ ర్యామ్‌, 64 జీబీ మెమరీ- మెమరీ కార్డ్‌ సపోర్ట్‌

ముంబై, సాక్షి: ఈ నెల రెండు లేదా మూడో వారంలో నోకియా లేటెస్ట్‌ స్మార్‌ ఫోన్‌ 3.4 దేశీ మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌ను ఎంపిక చేసిన కొన్ని యూరోపియన్‌ దేశాలలో సెప్టెంబర్‌లోనే నోకియా విజయవంతంగా ప్రవేశపెట్టింది. యూకేలో 3.4 నోకియా ఫోన్‌ ధర 130 పౌండ్లుకాగా.. దేశీయంగా సుమారు రూ. 12,000- 12,800 స్థాయిలో ఉండవచ్చని విశ్లేషకుల అంచనా. నోకియా స్మార్ట్‌ ఫోన్లలో 2.4 మోడల్‌, 5.3 మోడళ్ల ధరలు  రూ. 10,400- రూ. 12,999 మధ్యలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు మోడళ్ల మధ్యలో తాజా ఫోన్ ‌3.4 ధర ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. చదవండి: (దేశీ రోడ్లపై కేటీఎం ప్రీమియం సైకిళ్లు!)

ఇవీ ఫీచర్స్‌
నోకియా దేశీ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం నోకియా 3.4 మోడల్‌ మూడు కలర్స్‌లో లభ్యంకానుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 406 ఎస్‌వోసీ ప్రాసెసర్‌తో విడుదల కానుంది. 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ వరకూ అంతర్గత మెమరీను అందించనుంది. మైక్రో ఎస్‌డీకార్డ్‌ ద్వారా 512 జీబీ వరకూ మెమరీను పెంచుకునే సౌలభ్యం ఉంది. ఆండ్రాయిడ్‌ 10తో వెలువడనున్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు రెండేళ్ల వరకూ అప్‌డేట్స్‌ లభించనున్నాయి. బ్యాటరీ సామర్థ్యం 4,000 ఎంఏహెచ్‌కాగా.. యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌తో చార్జింగ్‌ చేయవచ్చు.  చదవండి: (హెల్మెట్‌ వాయిస్‌ కమాండ్స్‌తో ఇక బైకులు!)

బిగ్‌ డిస్‌ప్లే
నోకియా 3.4 ఫోన్‌ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగిన 6.39 అంగుళాల తెరతో వెలువడనుంది. డ్యూయల్ నానో సిమ్‌ కార్డ్స్‌ సపోర్ట్‌ చేస్తుంది. వెనుక భాగంలో మూడు కెమరాలు ఉంటాయి. 13 ఎంపీ ప్రైమరీ, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌, 5 ఎంపీ అల్ట్రావైడ్‌తో వీటిని ఏర్పాటు చేసింది. సెల్ఫీలు తీసుకునేందుకు అనుగణంగా ముందుభాగంలో 8 ఎంపీ హొల్‌పంచ్‌ కటౌట్‌ కెమెరాను ఎడమవైపు కార్నర్‌లో ఫిక్స్‌ చేసింది. ఏఐ ఇమేజింగ్‌, పోర్ట్రయిట్ మోడ్‌, నైట్‌ మోడ్‌ తదితర పలు ఫీచర్లను అంతర్గతంగా ఏర్పాటు చేసిన కెమెరా యాప్‌ ద్వారా యూజర్లు వినయోగించుకోవచ్చు. నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్‌ 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్‌, ఎన్‌ఎఫ్‌సీలతోపాటు ఎఫ్‌ఎం రేడియో ఫీచర్లను సైతం కలిగి ఉంది. 

మరిన్ని వార్తలు