మార్కెట్ లోకి నోకియా ఏసీలు.. 

21 Dec, 2020 19:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన చేసింది. ప్రముఖ టెలీకమ్యూనికేషన్స్ కంపెనీ 'నోకియా'తో కలిసి 'మేడిన్ ఇండియా' నోకియా ఎయిర్ కండీషనర్స్ ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. నోకియా బ్రాండ్ తో రాబోతున్న ఏసీలు ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇందులో స్వచ్ఛమైన గాలి కోసం 6-ఇన్ -1 ఫిల్టర్లు, యాంటీమైక్రోబయల్ అయానైజర్ ఇన్ బిల్డ్ గా రానున్నట్లు పేర్కొంది. ఇందులో ఇంటెలిజెంట్ మోషన్ డిటెక్షన్ సిస్టమ్, 4-ఇన్ -1 అడ్జస్ట్‌బుల్ ఇన్వర్టర్ మోడ్ కూడా ఉంది. నోకియా ఏసీలో స్మార్ట్ డయాగ్నోసిస్, షెడ్యూలింగ్ ప్రోగ్రామ్, కస్టమైజ్డ్ యూజర్ ప్రొఫైల్స్ ఉంటాయి. అలాగే సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ, యాంటీ-కరోసివ్ బ్లూ ఫిన్ టెక్నాలజీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్న రాగితో తయారు చేసిన ఇంటర్నల్స్, టర్బో క్రాస్ ఫ్యాన్ ఫ్లో, డ్యూయల్ రోటరీ కంప్రెసర్, ట్రిపుల్ ఇన్వర్టర్ టెక్నాలజీ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. వైఫై కనెక్టెడ్ స్మార్ట్ క్లైమాట్ కంట్రోల్ ఫీచర్లతో నోకియా ఏసీలను ఆపరేట్ చేసుకునే విధంగా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్లతో కూడా ఈ ఏసీలను ఆపరేట్ చేయొచ్చని నోకియా తెలిపింది. డిసెంబర్ 29,2020 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో 30,999 రూపాయల నుంచి నోకియా ఏసీలు విక్రయించనున్నారు.
 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు