నోకియా కొత్త లోగో చూశారా? నెటిజన్ల రియాక్షన్స్‌ మాత్రం..!

27 Feb, 2023 15:22 IST|Sakshi

సాక్షి, ముంబై: టెలికాం పరికరాల తయారీదారు నోకియా సరికొత్త ప్లాన్లతో కస్టమర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సరికొత్త, బడ్జెట్‌ఫోన్లతో ప్రత్యేకతను చాటుకుంటున్న నోకియా తాజాగా తన ఐకానిక్‌ లోగోను మార్చింది. దాదాపు 60 ఏళ్లలో తొలిసారిగా నోకియా (NOKIA) లోగో మార్చుతూ నిర్ణయం తీసుకుంది. తన పాపులర్‌ లోగోతోపాటు  బిజినెస్‌ వ్యూహాన్ని కూడా మార్చుతుండటం  గమనార్హం. తద్వారా తన బ్రాండ్ గుర్తింపును మరింత విస్తరించాలని  భావిస్తోంది.  కొత్త లోగోతో కొత్త శకనాకి నాంది పలకాలని భావిస్తోంది. 

సోమవారం బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్‌మార్క్ తన ప్లాన్లను ప్రకటించారు. నోకియా తన బ్రాండ్ ఐడెంటిటీని రిఫ్రెష్ చేస్తున్నట్టు తెలిపారు. ఇకపై నోకియా కేవలం స్మార్ట్‌ఫోన్ కంపెనీ మాత్రమే కాదు బిజినెస్ టెక్నాలజీ కంపెనీ కూడా అని ప్రకటించారు. బిజినెస్-టు-బిజినెస్ ఇన్నోవేషన్లీడర్‌గా ఎదగనుందని తెలిపారు. దీని ప్రకారం నోకియా కొత్త లోగోలో ఐదు రకాల డిజైన్‌లతో  NOKIA అనే ​​పదాన్ని రూపొందించింది. (నోకియా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌, మీరే రిపేర్‌ చేసుకోవచ్చు!)

మరోవైపు నోకియా కొత్తలోగోపై సోషల్‌మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు లోగోను బాగా ఇష్టపడుతోంటే, మరింకొందరు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. పాతదే బావుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా  కనెక్టింగ్‌ పీపుల్‌ అంటూ  విపరీతంగా ఆకట్టుకున్న ఐకానిక్‌ లోగోను మార్చడంపై  చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు కాగా ఇటీవల రైట్‌ రిపేర్‌ లో భాగంగా కస‍్టమర్లు  సొంతంగా  రిపేర్‌  చేసుకునే  జీ22ఫోన్‌ను  పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు