హెచ్ఎమ్డీ గ్లోబల్ భారత మార్కెట్లలోకి నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 18న లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నోకియా ఎక్స్ ఆర్20 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జూలైలో భారత్ మినహా మిగతా దేశాల్లో నోకియా ఎక్స్ఆర్20ను హెచ్ఎమ్డీ లాంచ్ చేసింది. నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత టఫెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ68 రేటింగ్‌తో రావడంతో సుమారు ఒక గంట లోపు నీటిలో ఉన్నకూడా పనిచేసే సామర్ద్యం నోకియా ఎక్స్ఆర్20 సొంతం.
గ్రానైట్,అల్ట్రా బ్లూకలర్ వేరియంట్స్‌తో ఈ స్మార్ట్ ఫోన్స్ కొనుగోలుదారులకు లభించనుంది. నోకియా ఎక్స్ఆర్20 6జీబీ+128 జీబీ ఇంటర్నల్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 46,990. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై నోకియా పవర్ బడ్స్ లైట్ ఇయర్‌బడ్స్ కొనుగోలుదారులకు ఉచితంగా లభించనున్నాయి. అంతేకాకుండా ఒక ఏడాదిపాటు స్క్రీన్ ప్రొటెక్షన్‌ను కూడా నోకియా అందిస్తోంది.
నోకియా XR20 ఫీచర్స్