తల్లిబిడ్డల కోసం రైల్వేశాఖ వినూత్న నిర్ణయం!

10 May, 2022 13:28 IST|Sakshi

చంటిపిల్లలు ఉన్న తల్లుల కోసం రైల్వేశాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రయాణ సమయంలో తల్లులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైలులో ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చింది.

నార్తర్న్‌ రైల్వే డివిజన్‌ అధికారులు చంటిపిల్లలు ఉన్న తల్లుల కోసం బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఆ డివిజన్‌కు చెందిన ఇంజనీర్లతో కలిసి లోయర్‌ బెర్త్‌లో కొన్ని అదనపు మార్పులు చేసి బేబీ బెర్త్‌ను రూపొందించారు. ఈ సౌకర్యాన్ని లక్నో మెయిల్‌లో తొలిసారిగా అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ ఫలితాలు బాగుంటే క్రమంగా ఇతర రైళ్లలోకి, ఇతర డివిజన్లలోకి విస్తరించే అవకాశం ఉంది.

భారతీయ రైళ్లలో పెద్ద సంఖ్యలో బాలింతలు, చంటిపిల్లలు ఉన్న తల్లలు ప్రయాణిస్తున్నారను. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో తల్లిబిడ​‍్డలు ఒకే బెర్త్‌పై పడుకోవాల్సి వస్తోంది. రైళ్లలో ఎన్నో కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఈ సమస్యకు ఇన్నాళ్లు పరిష్కరం చూపలేకపోయారు. అయితే తొలిసారిగి నార్నర్‌ రైల్వే ఇంజనీర్లు బేబీ బెర్త్‌ కాన్సెప్టుతో ముందుకు వచ్చారు. 

చదవండి: అప్పడు వర్క్‌ ఫ్రం హోం అడిగితే.. దారుణంగా...

మరిన్ని వార్తలు