రైల్వేలో మోసం, ప్రయాణికుడి దెబ్బకు దిగొచ్చిన రైల్వే శాఖ..

17 Dec, 2022 15:44 IST|Sakshi

హర్యానా రాష్ట్రంలోని అంబాలా రైల్వే డివిజన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల వద్ద నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న క్యాటరింగ్ కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 

ట్రైన్‌ నెంబర్‌ 12232 లక్నో ఎస్‌ఎఫ్‌ ఎక్సెప్రెస్‌లో చంఢీఘడ్‌ నుంచి షాహ్‌జాన్‌ పూర్‌కు ప్రయాణిస్తున్న శివం భట్‌కు ట్రైన్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఐఆర్‌సీటీసీ అమ్మే ‘రైల్‌ వాటర్‌’ బాటిల్‌ ఎంఆర్‌పీ రేటు రూ.15 ఉంటే..సేల్స్‌ మెన్‌ దినేష్‌ తన వద్ద నుంచి రూ.20 వసూలు చేశారని వాపోయాడు. రైల్వేలో జరుగుతున్న మోసాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

ఆ వీడియోలో మనం ఎంత ఫిర్యాదు చేసినా లాభం లేదు. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్‌ రైల్వే దోపిడి చేస్తున్న వారిపై ఎప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఇది గత రాత్రి ట్రైన్‌ నెంబర్‌ 12232లో ఎంఆర్‌పీ రేట్లు కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ నార్తన్‌ రైల్వేకు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్యాగ్‌ చేశారు.

మరో ట్వీట్‌లో,రైలు 12232లో ప్యాంట్రీ, మేనేజర్ లేరని వాటర్‌ బాటిల్‌ అమ్మేవాళ్లు చెబుతున్నారు. అంటే ఎవరైనా రైలు ఎక్కవచ్చు,రైల్‌ నీరును ఎంత ధరకైనా అమ్మువచ్చు? అని ప్రశ్నించారు. నెటిజన్‌ వరుస ట్వీట్‌లపై నార్తన్‌ రైల్వే స్పందించింది. రైల్‌ నీరును అధిక రేట్లకు అమ్ముతున్న విక్రేతని అరెస్ట్‌ చేశామని తెలిపింది.

మరిన్ని వార్తలు