ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి శుభవార్త.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్!

12 Oct, 2021 15:39 IST|Sakshi

మీరు దసరా, దీపావళి పండుగ సందర్భంగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తునారా? అయితే, మీకు అదిరిపోయే శుభవార్త. హీరో ఎలక్ట్రిక్ '30 రోజులు, 30 స్కూటర్లు' పేరుతో పండుగ ఆఫర్ ప్రకటించింది. మీరు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాలంటే అక్టోబర్ 7 నుంచి నవంబర్ 7 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న 700+ హీరో డీలర్ షిప్ లేదా వెబ్‌సైట్ లో స్కూటర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ హీరో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేసే వినియోగదారులలో ఒక లక్కీ కస్టమర్ తను కోరుకున్న హీరో ఎలక్ట్రిక్ టూ వీలర్ ఉచితంగా గెలుచుకునే అవకాశం ఉంది.  

ఈ 30 రోజుల్లో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లు అందరూ ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు. విజేతలను లక్కీ డ్రా ద్వారా తీయనున్నారు. ఎలక్ట్రిక్ వాహనం కొన్న తర్వాత వాహనం ఎక్స్ షోరూమ్ ధరను పూర్తిగా రీఫండ్ చేస్తారు. హీరో ఎలక్ట్రిక్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ సర్వీసులు అందిస్తుంది. కస్టమర్లు హీరో ఎలక్ట్రిక్ వెబ్‌సైట్ లేదా దేశవ్యాప్తంగా 700 టచ్ పాయింట్ల వద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. హీరో ఎలక్ట్రిక్ తక్కువ ధరతో ఈఎమ్ఐ సులభమైన ఫైనాన్సింగ్ సౌకర్యం అందిస్తుంది. అంతేగాక, వినియోగదారులకు లిథియం అయాన్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై 5 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. అయితే, నాలుగు ఏళ్ల తర్వాత బ్యాటరీ, చార్జర్ పై ఎటువంటి వారంటీ వర్తించదు. (చదవండి: టాటా రయ్‌.. ఝున్‌ఝున్‌వాలా ఖాతాలో 375 కోట్లు!)

మరిన్ని వార్తలు