6జీ టెక్నాలజీలో భారతీయులకు 100 పేటెంట్లు

20 Mar, 2023 06:28 IST|Sakshi

కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: 6జీ టెక్నాలజీకి సంబంధించి భారతీయ సైంటిస్టులు, ఇంజినీర్లు, విద్యావేత్తలకు 100 పేటెంట్లు ఉన్నాయని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌ అనేది చాలా సంక్లిష్టమైన అంశం అయినప్పటికీ మనవారు ఆ రంగంలో గణనీయ పురోగతి సాధిస్తున్నారని చెప్పారు. పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహించిన భారత్‌ స్టార్టప్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు.

5జీ నెట్‌వర్క్‌ విస్తరణ .. ప్రభుత్వం నిర్దేశించిన 200 నగరాలను కూడా దాటి ప్రస్తుతం 397 నగరాలకు చేరిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 3.5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్‌.. పాలన, మౌలిక సదుపాయాలు, వ్యాపారాల నిర్వహణలో మార్పులతో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని వైష్ణవ్‌ పేర్కొన్నారు. ఆ దిశగా అందరూ కృషి చేస్తే .. 30 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్‌ ఆవిర్భవించడాన్ని ఏ శక్తీ ఆపలేదని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు