మాస్టర్‌ కార్డు వినియోగదారులకు శుభవార్త!

9 Feb, 2021 17:57 IST|Sakshi

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఏదైనా వస్తువును తాకాలంటే ఎక్కువ శాతం ప్రజలు భయపడుతున్నారు. దింతో నగదు చెల్లింపుల విషయంలో కూడా ప్రజలు డిజిటల్ చెల్లింపులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులు కూడా ఎటిఎంలను తాకకుండానే నగదు ఉపసంహరణ చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకోని రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ విధానం ఇంకా అందరికి అందుబాటులోకి రాకున్నప్పటికీ పరీక్ష దశలో ఉంది. 

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్‌ కార్డ్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్‌తో సహాయంతో పూర్తి కాంటాక్ట్‌లెస్ నగదు ఉపసంహరణను విధానాన్ని తీసుకోని రాబోతుంది. మాస్టర్ కార్డు దారులు బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించి ఎటిఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బ్యాంక్ యాప్‌లో పిన్‌ను నమోదు చేయాలి. తర్వాత మీరు మొబైల్ లో ఎంటర్ చేసిన మొత్తాన్ని ఎటిఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం ఏటీఎంలలో మోసాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ మొదట బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ప్రారంభించింది. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ తన నెట్‌వర్క్‌లోని అన్ని ఎటిఎంలకు దశలవారీగా ఈ 'కాంటాక్ట్‌లెస్' క్యూఆర్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. 

చదవండి: సంచలనాలు సృష్టిస్తున్న షియోమీ
 
              
భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

మరిన్ని వార్తలు