టెలిగ్రామ్, వాట్సప్‌లోఈ ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాలు విన్నారో.. కొంప కొల్లేరే!

24 Aug, 2022 09:44 IST|Sakshi

రియల్‌ ట్రేడర్, గ్రో స్టాక్‌ సంస్థల ప్రకటనలు నమ్మొద్దు   

ఇన్వెస్టర్లకు ఎన్‌ఎస్‌ఈ హెచ్చరిక 

ముంబై: రియల్‌ ట్రేడర్, గ్రో స్టాక్‌ సంస్థలో ఎలాంటి పెట్టుబడులు పెట్టొందంటూ నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్(ఎన్‌ఎస్‌ఈ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ‘‘టెలిగ్రామ్, వాట్సప్‌ సామాజిక మాధ్యమాల ద్వారా కచ్చితమైన రాబడులను అందిస్తామంటూ రియల్‌ ట్రేడర్, గ్రో స్టాక్‌ సంస్థలు మోసపూరిత ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లను ఆఫర్‌ చేస్తున్నాయి. వీటిలో పెట్టుబడులు పెట్టి మోసపోద్దు. ఈ సంస్థలకు ఎక్స్చేంజ్ నుంచి ఎలాంటి గుర్తింపు లేదు’’ అని ఎన్‌ఎస్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే తరహా తప్పుడు ఆఫర్లను ప్రకటించడంతో గత నెలలో షేర్స్‌ బజార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను సైతం ఎక్స్చేంజ్ నిషేధించింది.   

ఇది చదవండి:  కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు: అంబానీకి ఐటీ నోటీసులు  

అదానీ గ్రూప్‌ చేతికి ఎన్‌డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు!

భారత్‌లో క్షీణిస్తున్న క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి

మరిన్ని వార్తలు