సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వచ్చేస్తోంది: ఇక వాటికి పెట్టుబడుల వెల్లువ!

23 Feb, 2023 17:10 IST|Sakshi

సాక్షి, ముంబై:  ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక విభాగంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎస్‌ఎస్‌ఈ)ని ఏర్పాటు చేయడానికి సెబీ ఆమెదించిందని తెలిపింది. దీని ప్రకారం మార్చినుంచి ఎస్‌ఎస్‌ఈ  మొదలు కానుందని  చెప్పింది. 

దీని ప్రకారం ఏదైనా సామాజిక సంస్థ, నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఓపి) లేదా ఫర్-ప్రాఫిట్ సోషల్ ఎంటర్‌ప్రైజెస్ (ఎఫ్‌పిఇలు), సామాజిక ఉద్దేశం ప్రాధాన్యాన్ని స్థాపించే సామాజిక స్టాక్ ఎక్స్ఛేంజ్ విభాగంలో రిజిస్టర్ చేసుకోవచ్చు,  లిస్టింగ్‌ కావచ్చు అని ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది.  అంటే  దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడుదారులుఈ సంస్థల షేర్లను కొనుగోలు చేయవచ్చు. సామాజిక కార్యక్రమాలకు ఆర్థిక సాయం, వాటికి దృశ్యమానతను అందించడానికి, సామాజిక సంస్థల ద్వారా నిధుల సమీకరణకు ఇది ఉపయోపడనుంది. అలాగే వినియోగంలో పారదర్శకతను పెంచడానికి సామాజిక సంస్థలకు కొత్త మార్గాన్ని అందించాలనేది కూడా తమ లక్ష్యమని ఎస్‌ఎస్‌ఈ పేర్కొంది

ఈ సెగ్మెంట్‌లో అర్హత కలిగిన  ఎన్‌ఓపీ  నమోదు చేసుకోవచ్చు. తద్వారా వీటిని పెట్టుడుల  సమీకరణకు ఆస్కారం లభిస్తుంది. ఆన్‌బోర్డింగ్ అర్హత కలిగిన  ఎన్‌జీవో  పబ్లిక్ ఇష్యూ లేదా ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ (ZCZP) వంటి సాధనాలను జారీ చేయడం ద్వారా నిధుల సమీకరణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. నిబంధనల ప్రకారం ఇష్యూ పరిమాణం కోటి  రూపాయలు,  సబ్‌స్క్రిప్షన్ కనీస అప్లికేషన్‌ సైజును రూ. 2 లక్షలుగాను  సెబీ నిర్దేశించింది. 

మరిన్ని వార్తలు