NSE INDIA : మహీంద్రా గ్రూప్‌.. 25 ఏళ్ల ప్రయాణం

3 Jan, 2022 13:48 IST|Sakshi

దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీగా అనేక రికార్డులు సృష్టిస్తున్న మహీంద్రా గ్రూపు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీలో అడుగు పెట్టి నేటికి 25 ఏళ్లు పూర్తి అయ్యాయి. దేశంలో రెండో స్టాక్‌ ఎక్సేంజీగా వచ్చిన నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీలో సైతం మహీంద్రా తనదైన ముద్రను వేసింది. 1996 జనవరి 3న ఎన్‌ఎస్‌ఈలో మహీంద్రా లిస్టయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్‌ఎస్‌ఈ ట్విట్టర్‌ వేదికగా మహీంద్రా గ్రూప్‌కి శుభాకాంక్షలు తెలిపింది. 


రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆర్మీకి జీపులు తయారు చేసే కంపెనీగా మార్కెట్‌లోకి అడుగు పెట్టిన మహీంద్రా అండ్‌ మహ్మద్‌ కంపెనీ ఆ తర్వాత మహీంద్రా అండ్‌ మహీంద్రాగా మారింది. గత 75 ఏళ్లలో మహీంద్రా గ్రూపు ఎన్నో విజయాలు సాధించింది. వాహనాల తయారీ నుంచి బ్యాంకింగ్‌ సెక్టార్‌ వరకు అనేక రంగంలో పాదం మోపి విజయం సాధించింది. 

మరిన్ని వార్తలు