ఎన్‌ఎస్‌ఈలో చమురు, గ్యాస్‌ ట్రేడింగ్‌

15 Apr, 2023 04:31 IST|Sakshi

ఫ్యూచర్‌ కాంట్రాక్టులకు రెడీ

న్యూఢిల్లీ: నైమెక్స్‌ క్రూడ్, నేచురల్‌ గ్యాస్‌లలో ఫ్యూచర్‌ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. కమోడిటీ డెరివేటివ్స్‌ విభాగంలో మే 15 నుంచి వీటిని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గత నెలలో అనుమతులు లభించడంతో రుపీ ఆధారిత నైమెక్స్‌ డబ్ల్యూటీఐ చమురు, నేచురల్‌ గ్యాస్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టులకు తెరతీసింది.

దీంతో ఎన్‌ఎస్‌ఈ ఎనర్జీ బాస్కెట్‌లో మరిన్ని ప్రొడక్టులకు వీలు చిక్కనుంది. కమోడిటీ విభాగం మరింత విస్తరించనుంది. వీటి ద్వారా మార్కెట్‌ పార్టిసిపెంట్ల(ట్రేడర్లు)కు ధరల రిస్క్‌ హెడ్జింగ్‌కు ఇతర అవకాశాలు లభించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీఐ చమురు, నేచురల్‌ గ్యాస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులను రుపీ ఆధారితంగా సెటిల్‌ చేసేందుకు ఎన్‌ఎస్‌ఈ సీఎంఈ గ్రూప్‌తో డేటా లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

మరిన్ని వార్తలు