ట్రేడర్లకు అలర్ట్‌: అదానీ షేర్ల పతనం, ఎన్‌ఎస్‌ఈ కీలక నిర్ణయం

2 Feb, 2023 21:45 IST|Sakshi

సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్‌ సంచలన రిపోర్ట్‌ తరువాత అదానీ గ్రూప్ షేర్లన్నీ దారుణంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీవో ఉపసంహరణ తరువాత దాదాపు అన్నీ 52 వారాల కనిష్టానికి చేరాయి. కొనేవాళ్లు లేక లోయర్ సర్క్యూట్‌ వద్ద నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో,  మార్కెట్ అస్థిరత కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్‌లను ఫిబ్రవరి 3, 2023 నుండి ASM (అదనపు నిఘా మార్జిన్) ఫ్రేమ్‌వర్క్ కింద ఉంచింది, దీని ప్రకారం ఆయా షేర్లలో ట్రేడింగ్ చేయడానికి 100శాతం మార్జిన్  ఉండి తీరాలి.  తద్వారా పలు ఊహాగానాలను,  షార్ట్ సెల్లింగ్‌ను అరికట్టవచ్చని అంచనా.  (షాకింగ్‌ డెసిషన్‌పై మౌనం వీడిన గౌతం అదానీ: వీడియో)

"ధర/వాల్యూమ్ వైవిధ్యం, అస్థిరత మొదలైన ఆబ్జెక్టివ్ పారామితుల ఆధారంగా సెక్యూరిటీలపై అదనపు నిఘా చర్యలు (ASM) ఉంటాయి" అని ఎన్‌ఎస్‌ఈ తన వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపర్చింది  (అదానీ షేర్ల బ్లడ్‌ బాత్‌: ఆరు రోజుల నష్టం, ఆ దేశాల జీడీపీతో సమానం!)

కాగా  అదానీ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ. 20 వేల  కోట్ల ఎఫ్‌ఈవో రద్దు తర్వాత, అదానీ గ్రూప్ మార్కెట్ నష్టాలు గురువారం నాడు 100 బిలియన్‌ డార్లకు పైగా  చేరిన సంగతి తెలిసిందే.ఫోర్బ్స్ గురువారం అదానీ సంపదను 64.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. దీంతో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో గౌతం అదానీ 16 వ స్థానానికి పడిపోయారు. (అదానీ ఆస్తులను జాతీయం చేయండి: మోదీకి బీజేపీ సీనియర్‌ నేత సంచలన సలహా)

>
మరిన్ని వార్తలు