మానిటైజేషన్‌కు ఎన్‌టీపీసీ రెడీ

4 Oct, 2021 00:45 IST|Sakshi

రూ. 15,000 కోట్ల సమీకరణ యోచన 

న్యూఢిల్లీ: విద్యుత్‌ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్‌టీపీసీ తాజాగా డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికలు ఆవిష్కరించింది. మూడు అనుబంధ సంస్థలను లిస్టింగ్‌ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా రూ. 15,000 కోట్ల సమీకరణకు వీలున్నట్లు తెలియజేసింది. జాబితాలో ఎన్‌టీపీసీ విద్యుత్‌ వ్యాపార్‌ నిగమ్‌(ఎన్‌వీవీఎన్‌), నార్త్‌ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌(నీప్‌కో)తోపాటు.. ఏడాది కాలమే ఏర్పాటు చేసిన ఎన్‌టీపీసీ రెనెవబుల్‌ ఎనర్జీ(ఎన్‌ఆర్‌ఈఎల్‌) ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా స్టీల్‌ పీఎస్‌యూ సెయిల్‌తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ(జేవీ) ఎన్‌టీపీసీ సెయిల్‌ పవర్‌ కంపెనీ నుంచి సైతం వైదొలగనున్నట్లు వెల్లడించింది.

వచ్చే ఏడాదిలో
ఎన్‌ఆర్‌ఎల్‌ను వచ్చే ఏడాది అక్టోబర్‌కంటే ముందుగానే లిస్టింగ్‌ చేయనున్నట్లు ఎన్‌టీపీసీ చైర్మన్, ఎండీ గురుదీప్‌ సింగ్‌ పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన విభాగంలో 2020 అక్టోబర్‌లో ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఏడాదికి 7–8 గిగావాట్ల సామర్థ్యాన్ని జత కలుపుకుంటున్నట్లు గురుదీప్‌ తెలియజేశారు. పవర్‌ ట్రేడింగ్‌కు ఏర్పాటు చేసిన కంపెనీ ఎన్‌వీవీఎన్‌ తదుపరి ఫ్లై యాష్‌ ట్రేడింగ్, వినియోగం, ఎలక్ట్రిక్, హైడ్రోజన్‌ మొబిలిటీ, వేస్ట్‌ టు ఎనర్జీ ప్రాజెక్టులను చేపట్టింది. గతేడాది మార్చిలో నీప్‌కోలో ఎన్‌టీపీసీ 100 శాతం వాటాను సొంతం చేసుకుంది. కంపెనీ 7 హైడ్రో, 3 థర్మల్, 1 సోలార్‌ పవర్‌ స్టేషన్లను నిర్వహిస్తోంది. 2,057 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 50:50 శాతం వాటాతో ఏర్పాటైన ఎన్‌టీపీసీ– సెయిల్‌ జేవీ దుర్గాపూర్, రూర్కెలా, భిలాయ్‌లలో సెయిల్‌ సొంత అవసరాలకు వీలుగా 814 మెగావాట్ల విద్యుదుత్పత్తి యూనిట్లను నెలకొలి్పంది. 

మరిన్ని వార్తలు