ఎన్‌టీపీసీ లాభం అప్‌

30 Jan, 2023 17:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్‌ దిగ్గజం ఎన్‌టీపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 5 శాతం బలపడి రూ. 4,854 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,626 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 33,784 కోట్ల నుంచి రూ. 44,989 కోట్లకు ఎగసింది.

కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4.25 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ కాలంలో సగటు విద్యుత్‌ టారిఫ్‌ యూనిట్‌కు 3.95 నుంచి రూ. 4.96కు పుంజుకుంది. బొగ్గు ఆధారిత పవర్‌ ప్లాంట్ల సామర్థ్య వినియోగం(పీఎల్‌ఎఫ్‌) 1.1 శాతం మెరుగై 68.85 శాతానికి చేరింది. 2022 డిసెంబర్‌ 31కల్లా భాగస్వామ్య కంపెనీలు, అనుబంధ సంస్థలతో కలిపి ఎన్‌టీపీసీ గ్రూప్‌ విద్యుదుత్పాదక సామర్థ్యం 70,884 మెగావాట్లుగా నమోదైంది. స్థూల విద్యుదుత్పత్తి 75.67 బిలియన్‌ యూనిట్ల నుంచి 78.64 బి.యూనిట్లకు ఎగసింది.

చదవండి: ఓలా సరికొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌.. కస్టమర్ల కోసం అదిరిపోయే బెనిఫిట్స్‌

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు