5జీ కోసం కీలక ఒప్పందం చేసుకున్న జియో!

29 Jun, 2021 20:59 IST|Sakshi

‎న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీ కంపెనీ ఎన్ఎక్స్ పీ, జియో ప్లాట్ ఫారమ్ భారతదేశంలో 5జీ సేవలను వేగంగా విస్తరించడం కోసం ఒప్పందం చేసుకున్నట్లు ఒక ప్రకటన వెలువడింది. ఈ ఒప్పందం వల్ల ఓ-ఆర్ఏఎన్(ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్ వర్క్ ఆర్కిటెక్చర్) టెక్నాలజీతో 5జీ వేగం విస్తృతంగా పెరగనుంది. దీనివల్ల ఇండస్ట్రీ 4.0, ఐఓటి(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) అప్లికేషన్లలలో, టెలి మెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, ఆగ్యుమెంటెడ్/వర్చువల్ రియాలిటీ, డ్రోన్ ఆధారిత వ్యవసాయ మానిటరింగ్ వంటి అనేక వాటిలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని అని ఎన్ఎక్స్ పీ ఒక ప్రకటనలో తెలిపింది.  

జియో ప్లాట్ ఫారమ్ తన కొత్త 5జీ ఎన్ఆర్ సొల్యూషన్స్ లో ఎన్ఎక్స్ పీ లేయర్ స్కేప్ ప్రాసెసర్లు అధిక పనితీరు కనబరిచాయి. "ఈ కలయికలో భాగంగా 3.5 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్లో 100 మెగాహెర్ట్జ్ ఛానల్ బ్యాండ్ విడ్త్ వద్ద 1 జీబీపీఎస్ కంటే ఎక్కువ ఇంటర్నెట్ వేగాన్ని పరీక్షించినట్లు" ఎన్ఎక్స్ పీ తెలిపింది. స్మార్ట్ సిటీలు, స్మార్ట్ హోమ్ లు, ఆరోగ్యం, విద్యలో సృజనాత్మక అప్లికేషన్లను ఎనేబుల్ చేస్తుంది. మొబైల్ యూజర్లు డేటా డౌన్ లోడ్ విషయంలో గణనీయమైన మార్పును గమనిస్తారు. ఇండోర్, అవుట్ డోర్ గణనీయంగా 5జీ సామర్ధ్యం పెరగనుంది.
 

మరిన్ని వార్తలు