మహిళలు కలలు కనే ధైర్యం చేయాలి: ఫల్గుణి నాయర్

11 Nov, 2021 16:14 IST|Sakshi

సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఈ- కామర్స్‌ కంపెనీ ‘నైకా’ లిస్టింగ్‌లో అదరగొట్టింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.1,125తో పోలిస్తే 80 శాతం ప్రీమియంతో రూ.2,018 వద్ద లిస్ట్‌ అయ్యింది. స్టాక్‌ మార్కెట్‌ అమ్మకాల ఒత్తిడిలో ట్రేడ్‌ అవుతున్నప్పటి.. ఈ షేరుకు ఏ మాత్రం డిమాండ్‌ తగ్గలేదు. ఓ దశలో ఏకంగా 100% శాతం దూసుకెళ్లి రూ.2,248 స్థాయిని అందుకుంది. చివర్లో అతి స్వల్ప లాభాల స్వీకరణ జరగడంతో 96 శాతం లాభంతో రూ.2,206 ట్రేడింగ్‌ను ముగిచింది.  మార్కెట్‌ ముగిసే సరికి కంపెనీ మార్కెట్‌ విలువ లక్ష కోట్ల పైన రూ.1.04 లక్షల వద్ద స్థిరపడింది. 

ఫల్గుణి నాయర్ ప్రారంభించిన బ్యూటీ స్టార్టప్ ఆమెను ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ర్యాంక్‌ల సరసన నిలిపింది. ఆమె స్థాపించిన ఈ కామర్స్‌ కంపెనీ నైకాలో సగం షేర్లు ఆమెవే. ఇప్పుడా ఆ షేర్లు 89% వరకు పెరగడంతో ఇప్పుడు 7 బిలియన్‌ డాలర్లతో అత్యంత సంపన్నురాలుగా మారారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆమె భారతదేశపు అత్యంత సంపన్న స్వీయ-నిర్మిత మహిళా బిలియనీర్‌గా నిలిచారు. ఇప్పుడు ఆమె జీవితంలో స్వీయ నియంత్రణ సాధించడానికి ఎక్కువ మంది మహిళలను ప్రోత్సహిస్తోంది. స్వంత స్టార్ట్-అప్ ప్రారంభించాలని చూస్తున్న మహిళలకు ఫల్గుణి నాయర్ కొన్ని సలహాలు ఇచ్చింది. 

(చదవండి: తనను చెంప దెబ్బలు కొట్టడానికి మహిళను పనిలో పెట్టుకున్న ఓనర్!)

"నాలాంటి మహిళలు తమ కోసం కలలు కనే ధైర్యం చేస్తారని నేను ఆశిస్తున్నాను" అని ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపింది. "భవిష్యత్ ప్రతి ఒక్కరికీ అవకాశాలను ఇస్తుంది, వాటిని సద్వినియోగం చేసుకోవాలని" ఆమె సూచించింది. 2005లో ఒక బ్యాంక్‌కి మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలు చేపట్టి, 2012లో తన 50వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇందుకు రెండు కారణాలు చెబుతారు ఫల్గుణీ నాయర్‌. ‘‘నాకు మేకప్‌ అంటే చాలా ఇష్టం. అలాగే ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఈ రెండు కారణాల వల్లే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను’’ అంటున్న ఫల్గుణీ నాయర్‌ తల్లిదండ్రులు గుజరాతీలు. కాని ముంబైలో పుట్టి పెరిగారు. 

ఆమె తండ్రి వ్యాపారవేత్త. ‘‘మా నాన్న గారి నుంచే నాకు చిన్నతనంలోనే వ్యాపారం చేయాలనే వచ్చింది. మా ఇంట్లో అందరూ స్టాక్‌ మార్కెట్, ట్రేడ్‌ గురించి మాట్లాడుకునే వాళ్లం. అలా నాకు వ్యాపారం మీద అవగాహన కలిగింది’’ అంటారు. అప్పట్లో, చాలా మంది భారతీయ మహిళలు తమ దగ్గరలో ఉన్న మామ్-అండ్-పాప్ దుకాణాలలో సౌందర్య, సంరక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు. అక్కడ వారికి తక్కువ ఆప్షన్లు ఉండేవి, ట్రయల్స్ చేసే అవకాశం లేదు.

ట్యుటోరియల్స్ & టెస్టిమోనియల్స్ సహాయంతో సౌందర్య, సంరక్షణ ఉత్పత్తులను కస్టమర్లకు సులభమైన ఆన్‌లైన్ ద్వారా విక్రయించాలని భావించింది. బ్యూటీకి సంబంధించిన ఉత్పత్తులకు భారతదేశంలో మంచి మార్కెట్‌ ఉందనీ, ఆ వ్యాపారం ప్రారంభించటం వల్ల తన కల నెరవేరుతుందని భావించారు. అందుకే, 2012లో మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఫల్గుని నాయర్ నైకాను మొదలుపెట్టారు. నైకా సౌందర్య ఉత్పత్తులను సేల్‌ చేస్తోంది. అంతేకాకుండా ఈ కంపెనీకి సొంతంగా రిటైల్ స్టోర్లు కూడా ఉన్నాయి.

(చదవండి: ప్లాస్టిక్‌ నుంచి పెట్రోల్‌..అందుబాటులో ఎప్పుడంటే?)

మరిన్ని వార్తలు