Nykaa: రూ. 850 కోట్లను సొంతం చేసుకోనున్న నైకా టాప్‌ ఉద్యోగులు..!

26 Oct, 2021 14:55 IST|Sakshi

Nykaa Top 6 Employees To Earn Over Rs 850 Crore Amid IPO:మగువలు మెచ్చిన ప్రముఖ ఈ-కామర్స్‌ కంపెనీ నైకా ఐపీవోను అక్టోబర్‌ 28న ప్రారంభించనుంది.నైకా మాతృ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్‌ కామర్స్ వెంచర్స్ దాని ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం ఒక్కో షేరు ధరను రూ. 1,085 నుంచి రూ. 1,125కు  నిర్ణయించింది. మూడు రోజుల పబ్లిక్ ఆఫర్ నవంబర్ 1న ముగియనుంది. దీంతో కంపెనీలోని పలు టాప్‌ ఉద్యోగులకు కాసుల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  నైకాలోని ఆరుగురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులు తమ షేర్‌ హోల్డింగ్స్‌, వెస్టెడ్‌ ఆప్షన్ల ద్వారా మొత్తంగా రూ. 850 కోట్లను ఆర్జించనున్నారని ప్రముఖ బిజినెస్‌ మీడియా సంస్థ మింట్‌ పేర్కొంది.
చదవండి: గెలుపు బాటలో మరో స్టార్టప్‌.. ఓఫోర్‌ఎస్‌లోకి పెట్టుబడుల వరద

ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌లు డిజిటల్ బ్యూటీ, వెల్‌నెస్ , ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ నైకాలో వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు. నైకా ప్రైవేట్ లేబుల్ విభాగం ఎఫ్‌ఎస్‌ఎన్‌ బ్రాండ్స్ సీఈవో రీనా ఛబ్రా కంపెనీలో  2.1 మిలియన్ షేర్లను, 0.12 మిలియన్ ఉద్యోగుల స్టాక్ ఆప్షన్‌లతో సుమారు రూ. 250 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. రీనా ఛబ్రా మే 2016 నుంచి ఎఫ్‌ఎస్‌ఎన్‌ బ్రాండ్స్‌తో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. 

అదేవిధంగా నైకా, మ్యాన్‌ బిజినెస్‌ సీఈవో నిహిర్ పారిఖ్ కంపెనీలో 2 మిలియన్లకు పైగా షేర్లను కలిగి ఉండగా..వీటితో రూ. 245 కోట్లను సంపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పారిఖ్‌ 2015 నుంచి నైకాలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది గాను రూ. 2.83 కోట్ల జీతాన్ని అందుకుంటున్నారు. నైకా ఈ-రిటైల్‌ సీటీవో సంజయ్ సూరి కంపెనీలో సుమారు 1.8 మిలియన్ షేర్లను కల్గి ఉండగా...దీంతో రూ.220 కోట్లను ఐపీవో ద్వారా సంపాదించుకొనున్నారు. కంపెనీ ఈ-రిటైల్‌ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ మనోజ్ జైస్వాల్ వద్ద రూ. 63 కోట్ల విలువైన షేర్లను కల్గి ఉన్నారు. కంపెనీ సీఎఫ్‌వో అరవింద్ అగర్వాల్ వద్ద రూ. 45 కోట్ల విలువైన షేర్లను, నైకా ఫ్యాషన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోపాల్ అస్థానా  రూ. 29 కోట్ల విలువైన షేర్లను కల్గి ఉన్నారు. 
చదవండి: తిరుగులేని టెస్లా.. రూ.75 లక్షల కోట్ల విలువైన కంపెనీగా రికార్డు

మరిన్ని వార్తలు